Rangu Seethaammo Song Lyrics | Latest Folk | Parshuram Nagam | Laddu Music
Singer | LAVANYA -BODDU DILIP |
Composer | PRAVEEN KAITHOJU |
Music | PRAVEEN KAITHOJU |
Song Writer | PARSHURAM NAGAM |
Lyrics
గుండిల రైక దానా
గోలిసాతు సీరదానా
నడుముకు బిందున్నదానా
నాగ కన్య నడక దానా
ఆగు సీతమ్మో ఓ..ఓ..
ఉంగరాల జుట్టు వాడా
కోల మొకం సిన్నవాడా
గతం అంతా మరిసినావా
మరిసి వెంట ఓచ్చుడెలా
రాకు రామయ్యో ..ఓ..ఓ..
నీ బిందెన సొట్ట కాదు
నీ సెంపాన సొట్ట సూసి
గుండెల ఖలేజా నింపి
గుంగాళ గాతమంతా కలిపి
అత్తి సీతమ్మో ఓ..ఓ..
నువ్వంటే బయం కాదు
దారేంట జనము సూడు
కల్లతో కాటేసే జనులు
మాటతో మాటేసే నారులు
వెల్లు రామయ్యే ఓ..ఓ..
జనులు ఉంటే భయం ఏలా
నువ్వు నేను ఒక్కటి కాగా
నారులు ఉంటే గుబులు ఎలా
నీలో నేను జతగా లేనా
రాంగు సీతమ్మో ఓ…ఓ..
ఒకటీ అంటే ఒక్కటి కాదు
తొవ్వ పొంటి సిలికాలుండు
రెండు అంటే రెండు కాదు
ఒర్రె పొంటి కొంగలు ఉండు
వద్దు రామయ్యో ఓ..ఓ..
సిలకలకు జామ పండ్లు
నీ కాలికి పట్ట గొలుసు
కొంగలకు సేప ఒరుగు
మెడల నకిలీసి మెరుపు
రాంగు సీతమ్మో ఓ..ఓ..
రాతనలా రాసులాద్దు
నీ పట్ట గొలుసులాద్దు
మెడల నకిలేసులొద్దు
సొమ్ములోద్దు సోకులోద్దు
వెల్లు రామయ్యో ఓ..ఓ..
ముసి ముసి నవ్వుల దానా
ముందటి కళ్ల బంధమేనా
సెంద్ర వంక మోము దాన
సేతూలూ కట్టేసుడేలా
సెప్పు సీతమ్మో ఓ..ఓ..
మీది కిందాడకట్టు
నాది మీదాడకట్టు
మీ అయ్య ఉరిమి సూత్తే
మా అయ్య రెచ్చిపోయే
పొత్తు కుదరదో ఓయ్…
ఇగురాల ముద్దుగుమ్మా
మీ అయ్యకు నచ్చజెప్పూ
ఒంటిగున్నమా అయ్యకు
ఓపికతో సెప్పి జుత్తా
రాంగు సీతమ్మో ఓ..ఓ..
అయ్యవ్వలు ఇన్నా గానీ
ఆడకట్టోల్లు ఇనారోయి
మంది కంట్లే మన్నువాడా
మానలేడవాపిరోయి
వెల్లిపోవయ్యో ఓ.ఓ..
ఒడ్డు మీద గుడ్డి కొంగలు
గునుక దంచుడు మాటలాడు
కట్ట మీద కాకులాన్ని
కల్లిబొల్లి కబుర్లాడీ
ఇడిసిపెట్టమ్మో ఓ..ఓ..
ఓ మాటల మోతేవారి
ఎట్లా జెత్తవో ఇగ మారీ
ఆపవోయి జిత్తుల మారీ
కోరుకున్నా ఏరికోరీ
జోడి కట్టయ్యో ఓ..ఓ..
ఓరుపు నేరూపుతోటీ
మీ వోల్ల గెలిసి వస్తి
మారలేని రాజ్యన
మందిని అదిలించి ఒస్తి
రెక్కవట్టామ్మో ఓ.ఓ..
ఉంగురాల జుట్టు వాడా
ఉండలేను నువ్వు లేక
కోల మొఖం సిన్నవాడా
కోట్లటకైనా ఉంటా
జోడి కట్టయ్యో నాతో
జోడికట్టయ్యో ఓ…ఓ…
జోడి కట్టయ్యో నాతో జోడి కట్టయ్యో..ఓ..ఓ..
Rangu Seethaammo Song Lyrics | Latest Folk | Parshuram Nagam | Laddu Music Watch Video
Tags
Rangu Seethaammo Song Lyrics
Rangu Seethaammo Song Lyrics Download
Rangu Seethaammo Song Lyrics In English
Rangu Seethaammo Song Lyrics In TElugu
Rangu Seethaammo Song Lyrics Meaning